ఏపీలో సినిమా షూటింగ్ లకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Cinema Shootings In AP : కరోనా వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని మార్గదర్శకాలతో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది.

Update: 2020-10-08 14:42 GMT

shootings 

Cinema Shootings In AP : కరోనా వలన సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని మార్గదర్శకాలతో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ మార్గదర్శకాలతో పాటుగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల షూటింగ్ లకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ విషయాన్నీ రాష్ట్ర ఫిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా అయన వెల్లడించారు.

మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందన్నారు. చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అయితే సినిమా షూటింగ్ ల సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటుగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాలని అయన కోరారు..

మార్గదర్శకాల ఇవే!

♦ టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉంటుంది.

 నటీనటులకు మాత్రం షూటింగ్ సమయంలో మాస్క్ ధరించడం పట్ల కొంత మినహింపు ఉంటుంది.

♦ సినిమా సెట్లోని పరికరాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుంది.

♦ షూటింగ్‌లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లను ఉపయోగించుకోవాలి.

♦ సెట్లో కచ్చితంగా అరుడుగుల దూరం పాటించాల్సి ఉంటుంది.

♦ ఇక సినిమాకి ముందు, విరామ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించాలి.

వీటికి సంబంధించిన వివరాలను www.apsftvtdc.inలో పొందుపరిచినట్టుగా అయన వెల్లడించారు.

Tags:    

Similar News