ఇవాళ ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
AP SSC Results 2022: మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ విడుదల చేయనున్న మంత్రి బొత్స
AP SSC Results 2022: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పలితాలను విడుదల చేయనున్నారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు ఆరు లక్షల 22 వేల 537 మంది హాజరయ్యారు. ఈనెల4న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఆలస్యం అయ్యిందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై విద్యార్ధులకు ర్యాంకులు అంటూ ప్రకటన చేయరాదని విద్యాసంస్థల యాజమాన్యాలను ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.