మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా నివర్
* కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 300 కి.మీ., * పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కి.మీ., * చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం * రాత్రికి తమిళనాడులో దగ్గర తీరం దాటే అవకాశం
నివర్ దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా నివర్ మారనుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో నివర్ కేంద్రీకృతమై ఉంది. రాత్రికి తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నివర్ ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.