AP Minister Vempalli Srinivas: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి వెల్లంపల్లి

AP Minister Vempalli Srinivas: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Update: 2020-07-10 06:30 GMT
Vempalli Srinivas (File Photo)

AP Minister Vempalli Srinivas: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.. అనంతరం అయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న వసతులను మరియు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, అన్నప్రసాద వితరణ కేంద్రాలను అయన పరిశీలించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని ఆయమ అధికారులకి సూచించారు. ఇక టీటీడీ ఉద్యోగులకి, సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని ఆయన సూచించారు.

టీటీడీకి రూ.56లక్షల హుండీ ఆదాయం

కరోనా వైరస్ ని ద్రుష్టిలో ఉంచుకొని భక్తులు పరిమిత సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. ఇక గురువారం నాడు తిరుమల శ్రీవారిని 9582 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా 3722 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అటు ఒక్కరోజే స్వామివారికి రూ. 56లక్షలు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక శుక్రవారం కూడా శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News