పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎత్తుగడ అదేనా ?

ఏపీ,తెలంగాణ మధ్య కృష్ణ జలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. శ్రీశైలం జలాశయం ఎగువన రాయలసీమకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వడానికి జగన్ సర్కార్ తెచ్చిన జీవో 203 పెద్దపై దుమారం రేపుతోంది.

Update: 2020-05-17 12:17 GMT

ఏపీ,తెలంగాణ మధ్య కృష్ణ జలాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. శ్రీశైలం జలాశయం ఎగువన రాయలసీమకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వడానికి జగన్ సర్కార్ తెచ్చిన జీవో 203 పెద్దపై దుమారం రేపుతోంది. తెలంగాణలో విపక్షాలు కూడా దీనిపై అభ్యంతరం తెలుపుతున్నాయి. అయితే, సీఎం జగన్ ఈ ప్రాజెక్టుపై అంత పట్టుబట్టి ముందుకు వెళ్లడానికి ఓ కారణం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలోని పోతిరెడ్డిపాడుకు, తెలంగాణలోని పాలమూరు - రంగారెడ్డి పథకానికి లింక్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ విషయంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు ఏపీకి లేఖలు రాశాయి. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విషయంలో వెనక్కి తగ్గాలంటే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును లేవనెత్తబోతున్నట్టు సమాచారం. పోతిరెడ్డిపాడు కొత్త ప్రాజెక్టు అయితే, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కొత్తదే అని ఏపీ వాదించనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర పథకాలను కూడా లేవనెత్తనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ల విషయంలో అప్పట్లో ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు 20 లేఖలు రాసింది. తెలంగాణ ప్రాజెక్టులు సరైనవే అయితే, తాము చేపట్టే ప్రాజెక్టులు కూడా పాతవే అని ఏపీ ప్రభుత్వం వాదించనున్నట్టు తెలిసింది. అయితే, అప్పట్లో కృష్ణా బోర్డు పెద్దగా పట్టించుకోలేదని, ఆ లేఖలకు ఇప్పటి వరకు సమాచారం రాలేదని ఏపీ ప్రభుత్వం వాదనగా ఉంది. అప్పుడు తమ అభ్యంతరాలను పట్టించుకోని కృష్ణా బోర్డు ఇప్పుడు తెలంగాణ లేఖ రాయగానే ఎలా స్పందిస్తుందని అన్నారు. 

Tags:    

Similar News