AP Government to Revive Sugar Factories: రైతుల బకాయిల చెల్లింపు కోసం చర్యలు

AP Government to Revive Sugar Factories: ఏపీలో సహకార రంగంలో చెక్కెర కర్మాగారాలు నష్టాల బాటలో పడి ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.

Update: 2020-07-04 03:30 GMT

AP Government to Revive Sugar Factories: ఏపీలో సహకార రంగంలో చెక్కెర కర్మాగారాలు నష్టాల బాటలో పడి ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపధ్యంలో రైతులకు బకాయిల చెల్లింపు.. కర్మాగారాలను నడిపించడం కష్టతరంగా మారింది. కొన్ని కర్మాగారాలు మూసివేత దిశలో ఉన్నాయి. వీటి నిర్వహణ భారంగా మారడంతో ఇటు కర్మాగారంలో పనిచేసే వారు.. అటు రైతులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంతవరకు నష్టాల్లో మగ్గుతున్న సహకార చక్కెర కర్మాగారాలను గాటన పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా ముందుగా ఫ్యాక్టరీకి చెరకును సరఫరా చేసిన రైతులకు పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని జగన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు రూ. 54.6 కోట్లను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే సహకార షుగర్ ఫ్యాక్టరీలపై మరింత అధ్యయనం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించిన జగన్.. ఆగష్టు 15లోగా నివేదికను సమర్పించాలని సూచించారు. 


Tags:    

Similar News