Andhra Pradesh: వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సిన్
Andhra Pradesh: వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సిన్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సిన్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో వృద్ధుల వ్యాక్సినేషన్‌పై దాఖలైన మెమోపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. రెండురోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
థర్డ్ వేవ్ పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తునానమని ప్రభుత్వం తరపు న్యాయవాది హై కోర్టుకు తెలిపారు. 26.325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులు, వ్యాక్సినేషన్ అంశాలపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు వివరాలను ప్రభుత్వం కోర్టుకు తలిపింది. పీజీ మెడికల్ విద్యార్థుల సేవలకు భవిష్యత్లో వెయిటేజీ ఇస్తామని తెలిపింది. ఇప్పటి వరకు 1955 బ్లాక్ ఫంగస్ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.