రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం జగన్ సమావేశం
* కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించింది *2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం తగ్గితే ఏపీలో 2.58 శాతం మాత్రమే తగ్గింది
CM Jagan Meeting: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం తగ్గితే ఏపీలో 2.58 శాతం మాత్రమే తగ్గిందని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే టర్మ్ రుణాలు 3వేల 237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. సాగు రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ జరిగిందని పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చామన్నారు. కౌలు రైతులకు రుణాలపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను తీర్చిదిద్దాలని మహిళా సాధికారత కోసం బ్యాంకర్ల సహకారం ఉండాలన్నారు.