విశాఖ వైసీపీ నేతలపై సీఎం జగన్ సీరియస్
* విశాఖ జిల్లా అభివృద్ధిపై వైసీపీ నేతల మధ్య రగడ * పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న నేతలు * విశాఖ వైసీపీలో తాజా గొడవలపై జగన్ అసంతృప్తి * విశాఖ వైసీపీ నేతలను తాడేపల్లికి పిలిచి క్లాస్ పీకిన జగన్
వైసీపీలో వరుస విభేదాలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదంటూ వార్నింగ్ ఇచ్చారు. కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్..గొడవలు పక్కకు పెట్టి పార్టీ అభివృద్ధికి పాటుపడాలంటూ క్లాస్ పికారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇటీవల తరచూ విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. నేతల మధ్య కోల్డ్ వార్ కాస్త బహిరంగ విమర్శలు, ఘాటు వ్యాఖ్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లా అభివృద్ధిపై జరిగిన సమావేశంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు పరస్పరం దూషించుకోవడంపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ నేతల మధ్య గొడవపై ఇన్ చార్జ్ మంత్రి కన్నబాబుతో చర్చించిన సీఎం జగన్.. వైసీపీ లీడర్లను తాడేపల్లికి పిలిపించుకుని మందలించారు.
విశాఖలో జరిగిన ఇష్యూపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అమర్నాథ్ లతో పాటు విజయసాయిరెడ్డితో సీఎం చర్చించారు. క్రమశిక్షణ కలిగి ఉండాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అటు చీరాలలో ఆమంచి, బలరాం వర్గీయుల మధ్య జరగుతున్న విభేదాలపైనా జగన్ సీరియస్ అయ్యారు.
ఇక తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తరచు వివాదాల్లోకి వెళ్లడంపైనా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. , గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేసిన కామెంట్స్ పైన వివరణ తీసుకున్నట్లు పార్టీవర్గాల ద్వారా బహిర్గతం అయ్యింది. పార్టీలో అంతర్గతంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప..బహిరంగ విభేదాలకు దిగితే ఎంతటి వారైనా క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం జగన్ హెచ్చరించారు.