రైతులకు ఉచితంగా బీమా: సీఎం జగన్‌

Update: 2020-06-26 07:08 GMT

రైతులకు ఉచితంగా బీమా అందించనున్నట్టు ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. రైతులకు బీమా ప్రీమియాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. శుక్రవారం 2018 రబీ పంటల బీమా సొమ్మును తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశారు. బీమా ప్రీమియం కింద రూ.596.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బీమా చెల్లింపుతో 5.94 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరునుంది. రైతు ఖాతాల్లో నేరుగా బీమా ప్రీమియం జమ కానుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ...గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.122 కోట్లను తామే చెల్లిస్తున్నామని అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రబీ పంటల బీమా కింద బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందిస్తామని ఆయన తెలిపారు. రైతులు వేసిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన వెల్లడించారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందిస్తాం అని సీఎం తెలిపారు.

Tags:    

Similar News