అక్కడ గవర్నర్.. ఇక్కడ వితౌట్ గవర్నర్..
Telugu States: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి.
Telugu States: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఉదయం 11గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా జరిగిన జిల్లాల పునర్ విభజనపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ సమాశాలకు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీకి హాజరయ్యేందుకు టీడీఎల్పీ మొగ్గు చూపడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంతో శాసనసభ ప్రారంభమవుతుంది. ఇక అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సీఎం, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలు చర్చించాలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ నెల 17 లేదా 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.