కరోనా వైరస్ ను నియంత్రించడానికి విశాఖపట్నానికి చెందిన స్నేహా సుధ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అక్కేన.జగన్మోహన రావు రెండు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల.పుష్ప శ్రీవాణికి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి 5 లక్షల రూపాయలు సి.ఎం.
రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారని అది చూసి తాము కూడా భాగస్వామ్యం కావాలని ఈ 2 లక్షలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమమంలో బలిజిపేట మండలం ఆజ్జాడ గ్రామానికి చెందిన గుంట్రెడ్డి కృష్ణ మూర్తి నాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు.