Aadhar For Industries in AP: ఇకపై పరిశ్రమలకూ ఆధర్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Aadhar For Industries in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆధర్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి పరిశ్రమకూ ఆధార్ సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తెసుకుంది.
Aadhar For Industries in AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆధర్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి పరిశ్రమకూ ఆధార్ సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తెసుకుంది. ఈ మేరకు 'పరిశ్రమ ఆధార్' పేరుతొ ప్రేత్యేక సంఖ్య జరీ చేయనుంది. ఇందుకోసం పరిశ్రమల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సమగ్ర సర్వే 2020 పేరిట ఈ సర్వే జరగనుండగా, అక్టోబర్ నాటికల్లా సర్వేను పూర్తి చేయాలనీ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. 9 అంశాలకు సంబంధించిన వివరాలని ఈ సర్వే ద్వారా సేకరించనున్నారు.
ఈ సర్వే ప్రతి పరిశ్రమకు సంబంధించి కార్మికులు, ముడి సరుకు లభ్యత, ఎగుమతులు, దిగిమతులు, మార్కెటింగ్, నీరు, భూమి, విద్యుత్ ఇతర వనరులకు సంబంధించి వివరాలను సేకరించనుంది ప్రభుత్వం. ఈ సమగ్ర పరిశ్రమ సర్వేకు జిల్లా స్థాయి కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల డైరెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అంతే కాదు, ఈ వివరాలను మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ సచివాలయం సిబ్బంది సేకరించనున్నట్లు సమాచారం.