వైసీపీ నవరత్నాల పథకంపై ఓ వ్యక్తి ఆవేదన
* ప్రభుత్వం ఇళ్ల స్థలం కేటాయించకపోవడంతో... * మద్యం సేవించి జాతీయ రహదారిపై బైఠాయింపు * రోడ్డుపై టేబుళ్లు, కుర్చీలు వేసి నాగరాజు హంగామా
నవరత్నాల పథకంలో భాగంగా ప్రభుత్వం తనకు ఇంటిస్థలం కేటాయించలేదని ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన చెందాడు. ఏం చేయాలో తోచక మద్యం సేవించి ఏకంగా జాతీయ రహదారిపైనే కుర్చీలు, టేబుళ్లు వేసి హంగామా చేశాడు. రోడ్డు మధ్యలో కూర్చుని వాహనా దారులను తెగ ఇబ్బంది పెట్టిన ఈ సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
అనంతసాగరం మండలానికి చెందిన నాగరాజు మర్రిపాడులో ఓ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయన ప్రభుత్వం ఇచ్చే ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇళ్లస్థలాల మంజూరులో ఆయన పేరు లేకపోవడంతో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. దీంతో జాతీయ రహదారిపై టేబుళ్లు, కుర్చీలు వేసి వాహనాలను ఎటు వెళ్లనీయకుండా అడ్డంగా కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.