YS Jagan Padayatra: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి

YS Jagan Padayatra: *2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభం.. *14 నెలల పాటు 3,648 కి.మీ. పాదయాత్ర చేసిన జగన్..

Update: 2021-11-06 02:33 GMT

YS Jagan Padayatra: ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి

YS Jagan Padayatra: వైసీపీ అధినేత పాదయాత్ర చేపట్టి నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీకి అధికారాన్ని తెచ్చిన పాదయాత్ర అది. ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో జగన్ చేసిన పాదయాత్ర ఓ చరిత్ర అనే చెప్పాలి. అలాంటి పాదయాత్ర ప్రారంభించిన ఈరోజును పండుగలా జరుపుకుంటోంది వైసీపీ.

2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రని ప్రారంభించారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర చేశారు. 134 నియోజవర్గాల్లో 3వందల 41 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్.. 3వేల 6వందల 48 కిలోమీటర్లు నడిచారు. 2వేల 5వందల 16 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలతో పాదయాత్ర చేశారు జగన్.

జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను గుర్తుచేసే విధంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగా నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలచుకుని అధికారం చేపట్టిన తర్వాత అందులో 97 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలిపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

అంతేకాకుండా ప్రతీ నియోజకవర్గంలో వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం, సర్వమత ప్రార్ధనలు, కేక్ కటింగ్ తో పాటు ఆయా నియోజకవర్గంలో పాదయాత్ర చేసేలా సూచనలు ఇచ్చింది పార్టీ.

Tags:    

Similar News