Corona Vaccine: ఏపీకి మరిన్ని కోవిషిల్డ్, కొవాక్సిన్ డోసులు
Corona Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కావడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వేగవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
Corona Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కావడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు టీకా వేగవంతం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. టీకాలు కొరత ఉండటంతో కష్టతరమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోరాష్ట్రానికి కోవిషిల్డ్, కోవేక్సిన్ డోసులు చేరుకున్నాయి. దీంతో మరింత టీకా ప్రక్రియ వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చే్స్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కోవిషిల్డ్ 11లక్షల45వేల 540డోసులు చేరుకోగా.. కోవాక్సిన్ 3లక్షల45వేల 680డోసులు కొనుగోలుకు చేసింది. ఏపిఎంఎస్ఐడిసి ద్వారా ఆయా ఇన్స్టిట్యూట్ లకు 50కోట్ల,39లక్షల30వేల 700రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అదేశాలు ఇచ్చారు .
కోవిషిల్డ్ 11లక్షల45వేల 540డోసులకు 36కోట్ల 8లక్షల 45వేల 100రూపాయలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. కోవేక్సిన్ 3లక్షల 45వేల 680డోసులకు 14కోట్ల 30లక్షల 85వేల 600రూపాయలు చేల్లిస్తున్నాం అని వెల్లడించారు. కొవిషిల్డ్ ఒక డోస్ 300రూపాయలు అదనంగా 5%టాక్స్ తో కలిపి 315రూపాయలు..కోవేక్సిన్ ఒక డోస్ 400రూపాయలు 5%టాక్స్ తో కలిపి 415రూపాయలు చెల్లించనుంది. 45సంవత్సరాల పైబడిన వారికి జూన్ నెల వరకు రెండు డోసులు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి వెల్లడించారు.