Eluru: టీచర్ మందలించడంతో.. కాలువలో దూకి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
Eluru: హై స్కూల్ వద్ద మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన
Eluru: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాకలో విషాదం చోటుచేసకుంది. టీచర్ మందలించడంతో మనస్తాపానికి గురైన పదోతరగతి విద్యార్థి పామర్తి ప్రదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలవరం కుడి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కొడుకు ఆత్మహత్యకు కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు విధ్యార్ది మృతదేహంతో కొప్పాక హై స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖాధికారి కొప్పాక చేరుకుని విద్యార్థి ఘటనపై ఆరాతీశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు..