పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి : సోనియా గాంధీ
కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.
కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. మోదీ సర్కార్ ప్రజల గొంతు నొక్కుతుందని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసనను పోలీసులు హింసాత్మకంగా మార్చారని ఆరోపించారు. అఖిలపక్ష నాయకులతో కలిసి సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్‌ను కోరారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్న ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని తప్పుపట్టారు. ఈ చట్టంపై ఈశాన్యరాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులు దేశం మొత్తం ఉన్నాయని పేర్కొన్నారు. శాంతియుత పద్దతిలో నిరసన చెస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి హింసాత్మక పరిస్థితులు తెచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో పరిస్థితులు అదుపు తప్పాయని, గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతిని కోరారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పరిస్థితులు అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవలె పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని జఫ్రాబాద్ లో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్ధుల నిరసన ప్రదర్శన సీలంపూర్ నుంచి ఫ్రాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిపివేశారు.
We are anguished at the manner in which the police has dealt with peaceful demonstrations. And as you all have seen the BJP govt has no compulsion when it comes to shutting down people's voices: Congress President Smt. Sonia Gandhi.
— Congress (@INCIndia) December 17, 2019
#HumaraDeshJalRahaHai pic.twitter.com/THpnNCjIl9