ఉపపోరు బీజేపీకి జీవన్మరణ సమస్య ..అభ్యర్ధిని వెతుక్కొనేపనిలో నిమగ్నం

Update: 2019-09-23 07:23 GMT

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచింది గెలుపు మాదంటే మాది అని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాయి. ఇక ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధమని చెబుతున్న బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్ మెంట్ లేదు బీజేపీది వ్యూహాత్మక మౌనమా..? ఓడిపోతే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న అనుమానమా..? ఇంతకు ఉపపోరులో బీజేపి స్ట్రాటజీ ఏంటీ .

హుజూర్ నగర్ ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించాయి. తమకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్ధి అని బీజేపీని అసలు కౌంట్ లోకి తీసుకోవడం లేదని గులాబీ నేతలు చెబుతుండగా ఈ ఉపఎన్నిక ప్రభుత్వంతో జరిగే పోరాటమని, 30 వేల మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ పనైయిపోందని తామే ప్రత్యామ్నాయని చెబుతున్న కమలనాధులు అభ్యర్ధిని వెతుక్కొనేపనిలో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు.

అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాపైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లను కైవసం చేసుకుంది. అప్పటి నుండి తెలంగాణలో బలం పెరిగిందంటున్న బీజేపీ హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే మంచి భవిష్యత్తే ఉంటుందని ఒకవేళ ఓడిపోతే బీజేపీకి వచ్చిన ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపపోరు బీజేపీకి జీవన్మరణ సమస్యే అని చెప్పక తప్పదు.

హుజూర్ నగర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. అయితే ఉత్తమ్ కుమార్ కు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నికల ఏజెంట్ గా పని చేసిన రాంరెడ్డి కాషాయ కండువ కప్పుకున్నారు. దీంతో బీజేపీ నెట్ వర్క్ పెరిగిందనే అంచనాకు కమలనాథులు వచ్చారు.

ఉపపోరులో అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ నేతలు ఆచుతూచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బోడ భాగ్యరెడ్డినే పోటీ చేయిస్తే రాష్ర్టంలో వీస్తున్న కాషాయ పవనాలతో పాటు సింపతి వర్కవుట్ అవుతుందని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. బోడ భాగ్యరెడ్డితో పాటు డాక్టర్ కోట రామారావు, ఎన్నారై అప్పిరెడ్డి పేరును బీజేపీ శ్రేణులు పరిశీలిస్తున్నాయి.

అప్పిరెడ్డి టీఆర్ఎస్ తో కలిసి ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయన్ను కలిశారు. అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోకపోయినా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. స్థానికంగా మంచిపలుకుబడి ఉన్న వ్యక్తిగా ఉండటంతో అప్పిరెడ్డిని బరిలోకి దించేందుకు బీజేప ఆసక్తి చూపుతుంది. ఎవరిని అభ్యర్ధిగా నిలుపుతుందనే తేలాల్సి ఉంది.

Full View

Tags:    

Similar News