TSRTC: ప్రజల ముంగిటకు టీఎస్ఆర్టీసీ.. ఊరికో బస్ ఆఫీసర్ నియామకం..
TSRTC: తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది.
TSRTC: తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆదాయం పెంచుకునే మార్గాలతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రజలను ఆకర్షించేందుకు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లు నియమించాలని నిర్ణయించింది.
మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్ ను నియమిస్తారు. విలేజ్ బస్ ఆఫీసర్లు నిత్యం గ్రామస్తులతో టచ్ లో ఉంటారు. 15రోజులకోసారి గ్రామస్తులతో సమావేశం అవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులు కావాల్సిన వారిని విలేజ్ ఆఫీసర్లు ప్రోత్సహిస్తారు. మే 1 నుంచి విలేజ్ బస్ ఆఫీసర్లు విధుల్లో చేరనున్నారు.