TS Court Recruitment 2022: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు..

TS Court Recruitment 2022: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు.

Update: 2022-03-05 11:28 GMT

TS Court Recruitment 2022: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. 

TS Court Recruitment 2022: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు. రాష్ట్రంలోని వివిధ కోర్టులో ప్రభుత్వం 591 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పది, ఇంటర్, డిగ్రీ చదివినవారందరికి ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి. స్టెనో గ్రాఫర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

1. స్టెనో గ్రాఫర్‌: 64 పోస్టులు

గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

2. జూనియర్‌ అసిస్టెంట్‌: 173 పోస్టులు

యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

3. టైపిస్ట్‌: 104 పోస్టులు

యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

4. ఫీల్డ్‌ అసిస్టెంట్: 39 పోస్టులు

యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

5. ఎగ్జామినర్‌: 42 పోస్టులు

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

6. కాపీస్ట్‌: 72 పోస్టులు

ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

7. ప్రాసెస్ సర్వర్: 63

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్‌ 4, 2022గా తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News