RS ప్రవీణ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్న టీఆర్ఎస్
Gadari Kishore: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gadari Kishore: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్ వీఆర్‌ఎస్ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీను ఎందుకు ప్రశ్నించరని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్.
దళిత బంధు పథకానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకమా? లేదా అనుకూలమా? అనేది చెప్పాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. బీజేపీ తల్లి పార్టీ, బీఎస్పీ పిల్ల పార్టీ అన్నారు. దళితులు బాగుపడతారు అనగానే ఇట్లాంటి వాడు ఒకడు బయటికి వచ్చి గందరగోళానికి గురిచేస్తరన్నారు. ఇట్లాంటి పార్టీలు వస్తుంటాయి. పోతుంటాయని బీజేపీ ప్రయోగిస్తున్న పావు ప్రవీణ్, ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రవీణ్ ను వాడుకుంటున్నారన్నారు. తెలంగాణలో సుస్థిర పాలనను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రలో భాగంగా ప్రవీణ్ కుమార్ వచ్చాడని చెప్పారు. బీజేపీ మద్దతుతోనే మాయావతి సీఎం అయ్యారని భవిష్యత్ లో ప్రవీణ్ కుమార్ జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యమాలను అణిచివేసిన రక్కసిగా పరిగణలోకి తీసుకుంటామన్నారు.