జిల్లాల్లో చిచ్చు రేపుతున్న వార్డుల విభజన

Update: 2019-07-21 12:07 GMT

నిబంధనలు అతిక్రమించారు గైడ్‌లైన్స్ గాలికి వదిలేశారు అడ్డగోలుగా మున్సిపల్ వార్డులను విభజించారు మరి అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల విభజన‌ జరిగిందా? కులాలు, మతాల కోసం విభజించారా? మున్సిపల్ వార్డుల విభజన వివాదంపై ఆదిలాబాద్ జిల్లా ఏమంటోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలలో వార్డుల విభజనపై రాజకీయ దుమారం చేలరేగుతోంది. అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని విపక్షాలు భగ్గుమంటున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మొత్తం 26 వార్డులుగా విభజించారు. అయితే వార్డుల. విభజనలో నిబంధనలు పాటించలేదన్న విమర్శలున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై వార్డుల విభజన చేశారని బీజేపీ ఆరోపిస్తుంది‌. మైనారిటీ వర్గాలు ఉన్న ప్రాంతంలో 14 వార్డులు, మిగితా ప్రాంతంలో 12 వార్డులు ఏర్పాటు చేశారు. మైనారిటీ వర్గానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కేలా కుట్ర పన్నారని అరోపిస్తున్నారు

ఇక నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాలలో కూడా ఇలాగే విభజించారన్న ఆరపణలున్నాయ్‌. వార్డుల విభజనకు మైనారిటీ ప్రాంతాలలో 1000 మంది ఓటర్లకు వార్డులు విభజన చేస్తే నాన్ మైనారిటీ ప్రాంతాల్లో 1600 నుంచి 2 వేల పైగా ఓటర్లు ఉండేలా విభజన చేశారని విపక్షాలు అంటున్నాయ్‌. అధికార పార్టీ బలంగా లేని చోట్ల విచ్చలవిడిగా వార్డుల చేశారని ఆదిలాబాద్‌లో కేఆర్‌కే కాలనీ, నిర్మల్‌లో బంగల్‌పేట, ‌బెల్లంపల్లిలో నాలుగు వార్డుల విభజన అసంబద్ధంగా ఉందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను టీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. వార్డుల విభజన అంతా నిబంధనల ప్రకారం జరుగుతుందని కావాలనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడుతోంది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్, రహదారి ఉంటే ఒకవైపు ఉండేలా ప్రతి నిబంధనను అమలు చేసేలా వార్డుల విభజన జరిగిందని జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగిన వార్డుల విభజనలో లోపాలు లేవని అధికారపక్షం అంటోంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మున్సిపల్‌ వార్డుల విభజన వివాదం రేకెత్తించేలానే కనిపిస్తోంది.

Full View

Tags:    

Similar News