అడవులు, వన్యప్రాణులను రక్షించుకుందాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఎండల దృష్ట్యా అడవులు, వణ్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు.

Update: 2020-04-20 13:58 GMT
అధికారులతో మాట్లాడుతున్న ఇంద్రకరణ్ రెడ్డి

ఎండల దృష్ట్యా అడవులు, వణ్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. సోమవారం గచ్చిబౌలిలోని తన నివాసంలో పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో వణ్యప్రాణులు దప్పికతో ఉంటాయని వాటి దాహార్తిని తీర్చడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగానే చెక్‌డ్యామ్‌లు, సోలార్‌ బోర్ల ద్వారా చిన్న చిన్న గుంతలు, సాసర్ల పిట్స్ లో నీళ్లను నింపే విధంగా చర్యలు తీసుకోవాలి సూచించారు.

వేసవి కాలం కాబట్టి అటవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. నగరంలోని జూపార్కులలోని జంతువులను మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అడవుల్లో ఉండే జంతువులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా జూలోని జంతువులకు సురక్షితమైన ఆహాన్ని అందించాలన్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పేదలు ప్రజలు, వలస కూలీలు, నిరాశ్రయులెవరూ ఆకలితో ఉండరాదని, వారికి ఆల‌యాల్లో ఆహార పోట్లాల‌ను పంపిణీ చేయాల‌ని ఆదేశించారు.

Tags:    

Similar News