రేపటినుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాను వ్యాక్సిన్ వేయించుకుంటానని స్పష్టం చేశారు మంత్రి ఈటల. కేంద్రం గైడ్‌లైన్స్ మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు, అపోహలు అవసరం లేదన్న ఈటల.. తొలి డోసు కంపెనీ వ్యాక్సిన్‌నే రెండో డోసుగా తీసుకోవాలని తెలిపారు. డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్ మాత్రమే అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి విడత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి టీకా వేస్తామన్నారు. రెండో విడతలో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి టీకా వేయడం జరుగుతుందని ఈటల వెల్లడించారు.