రాష‌్ట్రంలో ట్రెండీగా సీఎం కేసీఆర్‌ కండువా

Update: 2020-05-23 08:47 GMT

మాటలో అయినా.. చేతలో అయినా.. కేసీఆర్ అంటేనే ఒక ట్రెండ్‌. అలాగే ఆయనలో వచ్చిన ఓ మార్పు కూడా ఇప్పుడు ట్రెండీగా మారింది. ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌ నుంచి ఆయన డ్రెస్సింగ్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్‌లో వచ్చిన ఆ మార్పు ఏంటి..? ఆ మార్పులో వెనకాల ఉద్దేశ్యమేంటి..? లెట్స్‌ వాచ్.

సీఎం కేసీఆర్ డ్రెస్సింగ్‌ స్టైల్‌ మార్చారు. ఇదివరకటి కంటే కొత్త లుక్‌తో కనిపించారు. గత రెండు ప్రెస్‌ మీట్‌లలో ఆయనలో ప్రత్యేక తేడా కనిపించింది. అదే కేసీఆర్‌ మెడలో కండువా. సాధారణంగా గులాబీ కండువా వేసుకుని వచ్చే సీఎం.. ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్లకు తెల్ల కండువాతో వచ్చారు. దీంతో సీఎం న్యూ లుక్‌ అందరినీ ఆకర్షించింది.

అయితే నేతన్నల ఖిల్లా సిరిసిల్ల వస్త్రాలకు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకే సీఎం కేసీఆర్ స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ధరించిన కండువాను సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేశారు. మొదటి నుంచి నేత వస్త్రాలపై మక్కువ ఉన్న కేసీఆర్.. మొత్తం 25 వందల కండువాలని ఆర్డర్ చేశారు. ఇప్పటికే బతుకమ్మ చీరలతో సిరిసిల్ల నేత కార్మికులకు బ్రాండింగ్ రాగా... స్వయంగా ముఖ్యమంత్రే కండువా ధరించటంతో నేత వస్త్రాల డిమాండ్‌ మరింతగా పెరగనుంది.

Tags:    

Similar News