ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకున్ని కాపాడి మానవత్వం చాటుకున్న ఎస్సై
ప్రజలను రక్షించేందుకు పోలీసులు నిరంతరం శ్రిమిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.
ప్రజలను రక్షించేందుకు పోలీసులు నిరంతరం శ్రిమిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే వారిలో కొంత మంది పోలీసులు కొంత మంది బాధలను చూసి చలించిపోయి ఏదో ఒక సాయం చేస్తారు. మరికొంత మంది ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్షించి వారికి ప్రాణాలను కాపాడతారు. అదే క్రమంలో ఓ ఎస్సై ప్రాణాపాయంలో ఉన్న యువకుడిని కాపాడి మానవత్వం చాటుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళ్తే కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం కూడా అదే పనిలో నిమగ్నమయ్యాడు యువకుడు. కాగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు ట్రాక్టర్ కింద పడిపోయి ఇరుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో నగర ఎస్సై ప్రశాంత్ పెట్రోలింగ్‌లో భాగంగా అటువైపు వెళ్లారు. ప్రమాదాన్ని గమనించి అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఎస్సై మిగతా సిబ్బంధితో ట్రాక్టర్ కింద చిక్కుకున్న యువకుడ్ని బయటకు తీసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకున్ని వెంటనే ఎస్సై ప్రశాంత్ తన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలోనే ఆ యువకుడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడడంతో వెంటనే ఎస్సై యువకుడి గుండెకు పంపింగ్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో యువకుడు కాస్త తేరుకోవడంతో వెంటనే అక్కడి నుంచి హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు ఆ యువకున్ని ఆస్పత్రిలో చేర్చుకుని మెరుగైన వైద్యం చేశారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన సమయానికి యువకుడ్ని తరలించి ఎస్సై అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడిని కరీంనగర్ ఎస్ఐ ప్రశాంత్ కాపాడారు.