Gold Rates: స్థిరంగా పెరుగుతున్న బంగారం ధరలు.. 10 గ్రాముల పసిడి 63 వేలు

Gold Rates: అన్ని ప్రధాన నగరాల్లోనూ పెరిగిన బంగారం ధరలు

Update: 2024-02-22 15:00 GMT

Gold Rates: స్థిరంగా పెరుగుతున్న బంగారం ధరలు.. 10 గ్రాముల పసిడి 63 వేలు

Gold Rates: ఫిబ్రవరి ప్రారంభం నుంచి పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు.. గత మూడు రోజుల నుంచి వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 270 పెరిగింది. దీంతో పసిడి ధరలు10 గ్రాములకు దాదాపు రూ. 63000కు దగ్గరగా చేరాయి. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి.

అన్ని చోట్లా ఈ రోజు రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. బంగారం ధరలు పెరిగిన తరుణంలో వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నేడు ఒక కేజీ వెండి ధర రూ. 76000 వద్ద ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తక్కువ. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా వెండి ధరలు తగ్గాయి.

Tags:    

Similar News