Telangana BJP: తెలంగాణ బీజేపీలో రహస్య సమావేశాల కలకలం

Telangana BJP: పార్టీ లైన్‌ దాటితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న తరుణ్‌చుగ్‌

Update: 2022-02-24 02:28 GMT

తెలంగాణ బీజేపీలో రహస్య సమావేశాల కలకలం

Telangana BJP: తెలంగాణ బీజేపీలో రాజుకున్న వివాదానికి పులిస్టాప్ పెట్టడానికి రాష్ట్ర నాయకత్వం సిద్దమవుతోంది. గత ఆరునెలలుగా పార్టీలో వివాదానికి కారణం అవుతున్న అసమ్మతి నేతలపై వేటు వేయడానికి సన్నదమవుతోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంచార్జ్ అనుమతితో షోకాష్ ఇవ్వడానికి రెడి అవుతున్నారు. రెండు రోజుల్లో అసమ్మతి మీటింగ్‌కు కారణమైన నేతలు పార్టీకి వివరణ ఇవ్వకుంటే షోకాజ్ ఇచ్చి వేటు వేయాలని పార్టీ భావిస్తోంది.

తెలంగాణ బీజేపీలో గత కొద్ది రోజులుగా పార్టీలో అసమ్మతికి కారణమైన నేతలను పార్టీ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వరుసగా సీనియర్ల మీటింగ్‌కు హాజరయ్యారని ప్రచారం జరుగుతున్న వారు ఒక్కొక్కరుగా పార్టీకి బహిరంగ వివరణలు ఇస్తున్నారు. కొందరు నేతలు లేఖలు విడుదల చేస్తే, మిగత వాళ్లు బహిరంగంగా హైదరాబాద్‌లో జరిగిన రహస్య భేటికి తాము వెల్లలేదని ప్రకటన విడుదల చేశారు. పార్టీ సీనియర్ నేత నాగురాం రామోజీ పార్టీకి లేఖ రాశారు. తనకూ రహస్య భేటికి సంబంధంలేదని వివరణ ఇచ్చారు. అసత్య ప్రచారం చేస్తున్నారని లేఖలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆయన బాటలోనే సీనియర్ నేత వెంకటరమణి, సాంబమూర్తి, పాపారావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిలు తమకు రహస్య భేటీతో సంబందం లేదని పార్టీకి వివరణ ఇచ్చి బహింరంగంగా ప్రకటన చేశారు.

అయితే ఈ రహస్య సమావేశానికి ప్రధాన కారణం అయిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్టారెడ్డి, సుగుణాకర్ రావులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్టీకి సంబంధించి సీనియర్లతో రహస్యంగా భేటిలు నిర్వహించడానికి కారణాలు కూడ పార్టీలో ఎవ్వరికి వివరించలేదని చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై గుర్రుగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సైలంట్‌గా ఉండే అవకాశం ఉంది. కానీ రామకృష్ణ రెడ్డి, సుగుణాకర్ రావులు ఇప్పటి వరకు స్పందింకపోవడంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అందుకు బండి సంజయ్, ఇంచార్జ్ తరుణ‌్ చుగ్‌ అనుమతి తీసుకున్నట్లు పార్టీలో ముఖ్యనేతలు అంటున్నారు. ఇవాళ సాయంత్రంలోపు ఆ ఇద్దరు నేతలు స్పందించకపోతే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.

Tags:    

Similar News