పెద్దపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఇసుక రాజకీయం

*ఓదెల మల్లన్న సాక్షిగా ప్రమాణం చేయాలని విజయరమణారావు డిమాండ్

Update: 2022-10-02 08:24 GMT

పెద్దపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఇసుక రాజకీయం

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. జిల్లాలో ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ముడుపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత విజయరమణారావు.. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఓదెల మల్లన్న ఆలయంలో ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక వివాదంపై ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇందులో భాగంగా సుల్తానబాద్‌లో కూడా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీఎస్‌లోనే ఇరువర్గాల నేతలు తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు ఓదెల మల్లిఖార్జునస్వామి ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును పోలీసులు అరెస్టు చేశారు. ధర్మారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అటు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు. ఇసుక టెండర్లలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి డబ్బులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆరోపించారు.

Tags:    

Similar News