Harish Rao: 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. జైనూర్‌లో మహిళపై జరిగిన హత్యాచార ఘటన అత్యంత పాశవికమని అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 హత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని విమర్శించారు.
బాధిత మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టుగా పరిస్థితి తయారయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.