Hyderabad: దసరాకు తరలి వెళ్తున్న ప్రజలు
Hyderabad: ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
Hyderabad: హైదరాబాద్ నుంచి దసరా పండుగకు ప్రజలు తరలి వెళ్తున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. JBS, M.G.B.Sతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తారు. టీఎస్ఎస్ ఆర్టీసీ 4,198 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,795 ప్రత్యేక బస్సులు, ఆంధ్రపదేశ్‌కు 328 ప్రత్యేక బస్సులు, కర్ణాటకకు 75 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా, దీపావళి పండుగల సందర్బంగా 315 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని సర్వీసులకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక రైళ్లకు తాత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటికే దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు.