Pawan Kalyan: 470 కేజీల సిల్వర్‌ చైన్‌లతో.. పవన్‌ కళ్యాణ్‌ కళాకృతిని రూపొందించిన సుజయ్‌ బాబు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా..

Update: 2023-08-31 07:38 GMT

Pawan Kalyan: 470 కేజీల సిల్వర్‌ చైన్‌లతో.. పవన్‌ కళ్యాణ్‌ కళాకృతిని రూపొందించిన సుజయ్‌ బాబు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు వినూత్న శుభాకాంక్షలు చెప్పారు. సుమారు 470 కేజీల సిల్వర్‌ చైన్‌లతో పవన్‌ కళ్యాణ్‌ కళాకృతిని రూపొందించి సుజయ్ బాబు అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 470 కేజీల వెండితో చిత్ర రూపం తీర్చిదిద్దారు. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.

జనసేన అధినేత పవన్‌కు విన్నూతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలన్న ఆలోచనతో ఓ స్వర్ణ కళాకారుడి ద్వారా ఈ రూపాన్ని తయారు చేయించినట్లు సుజయ్‌ బాబు తెలిపారు. 470 కేజీల వెండితో చిత్ర రూపాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి, పార్టీ నేతలు వెంకటేశ్వర్లు సుందర రామిరెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News