Nagarjuna Sagar: నేడు తెరుచుకోనున్న సాగర్‌ క్రస్ట్‌ గేట్లు

Nagarjuna Sagar: వరద నీటితో కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి.

Update: 2024-08-05 04:50 GMT

Nagarjuna Sagar: నేడు తెరుచుకోనున్న సాగర్‌ క్రస్ట్‌ గేట్లు

Nagarjuna Sagar: వరద నీటితో కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 4 లక్షల 41 వేల 183 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

సాగర్ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. దీంతో నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 12 గంటలకు క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలనున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

Tags:    

Similar News