Minister KTR: భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి
Minister KTR: కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధం
Minister KTR: భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి కేటీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ భర్తీ పరీక్షలు నిర్వహించకపోవడం అన్యాయమని చెప్పారు.
దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటిదాకా నోటిఫికేషన్లు ఇవ్వని మోడీ ప్రభుత్వం.. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను హిందీ, ఇంగ్లీష్‌లో నిర్వహిస్తూ మాతృభాషలో చదువుకున్న కోట్లాది మంది ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తుందని మండిపడ్డారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని.. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దామంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.