DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శలు
DK Aruna: ఏనాడైనా మహబూబ్నగర్ జిల్లా ప్రజల కోసం ఏవైనా చేశారా..?
DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడైనా మహబూబ్నగర్ జిల్లా ప్రజల కోసం ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు. జిల్లా కోసం ప్రాజెక్టుల విషయంలో ఏనాడైనా పోరాటాలు చేశారా అంటూ నిలదీశారు. ఇప్పుడు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కల్వకుర్తి నుంచి వలస వచ్చిన ఈ ఇద్దరు నేతలు మహబూబ్ నగర్ కోసం ఏం చేశారో.. ప్రజలకు వివరించిన తర్వాతనే ఓట్లడగాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.