ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం

*దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం

Update: 2022-10-18 02:30 GMT

ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం

Weather Report: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా.. తరువాత తుఫానుగా మారి, పశ్చిమ మధ్య దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నిన్న పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు 21న సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..కురిసే అవకాశ ఉందని, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News