KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా
KTR: బీఆర్ఎస్, వైసీపీ, బీజూ జనతాదళ్ పార్టీలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి
KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని చెప్పారు.