Kishan Reddy: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు కిషన్‌రెడ్డి శంకుస్థాపన
Kishan Reddy: అనేక బస్తీల్లో డ్రైనేజీ ఓవర్ ఫ్లో అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
Kishan Reddy: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని రాంనగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నగరంలోని అనేక బస్తీల్లో డ్రైనేజీ ఓవర్ ఫ్లో అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరణ చేయాలని, తాగునీరు కలుషితం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన నిధులను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.