అన్నదాతల సమస్యలపై వరుస పోరాటాలు.. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతున్న కేసీఆర్‌

గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీపై కౌంటర్ అటాక్

Update: 2024-05-24 05:14 GMT

అన్నదాతల సమస్యలపై వరుస పోరాటాలు.. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతున్న కేసీఆర్‌

BRS: బీఆర్ఎస్ రైతు ఏజెండా ఎత్తుకుందా..? అన్నదాతలనే గులాబీ పార్టీకి నమ్ముకుందా...? రైతుల పక్షాన పోరుబాటతో పార్టీ బలోపేతం అవుతుందా..? గులాబీ బాస్ కర్షక పోరాటం వెనుక ఉన్న మర్మం ఇదేనా..?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రైతు ఏజెండా ఎత్తుకుందా అంటే అవుననే అంటున్నాయి బీఆర్ఎస్‌ శ్రేణులు. మొదటి నుంచి అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రైతు వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుని సక్సెస్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రైతు అంశంపై గళమెత్తారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, కౌలు రైతులు, రైతులు, రైతు కూలీలు, ఉచిత విద్యుత్, పంట కొనుగోలు, వరికి 500 బోనస్ అంశాలను ప్రచారం చేస్తున్నారు. రైతుబంధు, రుణ మాఫీ, పంటల భీమా చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాలకు 500 బోనస్‌ ఇవ్వాలని, రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులు ఆదుకోవాలంటూ కార్యకర్తలు కదంతొక్కారు. ఆరుగ్యారంటీలు అమలుతోపాటు... ఆగస్టు 15లోపు 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అయినా బీఆర్ఎస్‌ మాత్రం కౌంటర్ అటాక్ దిగుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News