అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక విమానం
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా వారందరినీ కేంద్రం వెనక్కి తసుకురావాలనే ఉద్దేశంతో వందే భారత్ మిషన్ ను అమలు చేసారు. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను వెనక్కి తీసుకువస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమెరికా నుంచి ప్రత్యేక విమానం చేరుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో టేకాఫ్ అయిన ఈ విమానం ముందుగా ముంబైకి చేరుకుంది. అక్కడ కొంత మంది ప్రయాణికులను దించేసి 120 మంది ప్రయాణిలకుతో హైదరాబాద్ కు చేరుకుంది. మరో విమానం బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకుంది. శనివారం కూడా కువైట్ నుంచి 167 మందితో కూడిన ప్రత్యేక విమానం హైదరాబాద్ చేరుకుంది.
ఇక విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా తమ తమ ఇండ్లకు పంపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముందుగా ఇమ్మిగ్రేషన్, పర్సనల్ చెకింగ్, థర్మల్ స్క్రీనింగ్ ప్రక్రియలు పూర్తి చేస్తారు. ఆ తరువాత వారిని హైదరాబాద్ హోటళ్లలో ఏర్పాటు చేసిన 29 పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు విమానాశ్రయం నుంచి ఆర్టీసీ బస్సుల్లో తరలించనున్నారు. ప్రయానికులు ఆ హోటల్లలో అవసరమైన ఖర్చును భరిస్తూ 14 రోజులపాటు ఉండేందుకు ఏర్పాట్లు చేసారు.
ఫైవ్ స్టార్ హోటళ్లలో 14 రోజులు ఉండాలను కునే వారు రూ.35 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. త్రీ స్టార్ హోటళ్లలో ఉండాలనుకునే వారు రూ.15 వేలు చెల్లించాలి. ఇక సాధారణ హోటళ్లలో ఉండే వారు రూ.5 వేల చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెల్లిన వలస కూలీలకు ఉచితంగానే ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతారు.