పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించాయి.

Update: 2020-05-30 05:04 GMT

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించాయి. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ, మరఠ్వాడా మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతుంది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురియడంతో పలు జిల్లాలన్ని అతలాకుతలం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలతో పాటు దరూర్‌, కెటిదొడ్డి, గట్టు, ఐజలో ఈ తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి.

ఇక మంచిర్యాల జ్లిలా వ్యాప్తంగా ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. జిల్లాల్లోని పలు పలు మండలాలలో వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. అంతే కాక కొన్ని మండలాలలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ధ్వంసమయ్యాయి. దీంతో కొన్ని పట్టణాలలో రాత్రి నుంచి కరెంటు లేక చీకట్లు కమ్మాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోనూ గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. శాయంపేట మండలం, తహరాపూర్‌ గ్రామంలో స్తంభాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లు ధ్వంసమయ్యాయి. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ గ్రామంలో గొర్రెలమందపై పిడిగుపడి మూడు గొర్రెలు మృతిచెందాయి. ఆయా ప్రాంతాల్లో ధాన్యపు రాశులు తడిశాయి. పరకాల వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ధాన్యం తడిసింది ముద్దయ్యింది. దీంతో రైతులు పంట నష్టపోయామని వాపోయారు.

Tags:    

Similar News