Harish Rao: ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి

Harish Rao: తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వారికి నాలుగు నెలలుగా జీతాలు మాత్రం చెల్లించడం లేదు

Update: 2024-05-21 05:19 GMT

Harish Rao: ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి

Harish Rao: కొత్తగా నియమితులైన నర్సింగ్‌ ఆఫీసర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు మాజీమంత్రి హరీష్‌రావు. 4వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన 7వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఘనతను.. తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వారికి నాలుగు నెలలుగా జీతాలు మాత్రం చెల్లించడం లేదన్నారు. ఎల్బీస్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి.. గాలికి వదిలేసింది తప్ప.. వారి జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో నియమితులైన 4వేల మంది నర్సింగ్‌ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారన్నారు హరీష్‌రావు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. నర్సింగ్‌ ఆఫీసర్లకు పెండింగ్‌లో ఉన్న 4 నెలల పెండింగ్‌ జీతాలు తక్షణమే చెల్లించాలని రేవంత్‌ సర్కార్‌ను హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News