Harish Rao: దేవుడిపై ఒట్టేసి సీఎం రేవంత్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్న గులాబీ నేతలు
Harish Rao: రేపు యాదాద్రిని దర్శించుకొని పూజలు చేస్తామన్న మంత్రి హరీష్ రావు
Harish Rao: తెలంగాణలో మాఫీ మంటలు చెలరేగుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీ నెరవేర్చామని ప్రభుత్వ పెద్ద చెబుతుంటే.. ఇది పాక్షిక రుణమాఫీ అంటూ విపక్ష పార్టీ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 15లోగా వందశాతం రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్టు పెట్టి చెప్పిన సీఎం రేవంత్ హామీని గుర్తు చేస్తున్నారు గులాబీ నేతలు. సీఎం రేవంత్ యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని, ఆ పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచాలని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటామన్నారు హరీష్‌రావు.