విపక్షాలకు బూస్టింగ్‌ ఇస్తోన్న దుబ్బాక ఫలితాలు

Update: 2020-11-12 08:02 GMT

టీఆర్ఎస్ కోట దుబ్బాకలో కమల వికాసం కాషాయ దళంతో పాటు ఇతర పార్టీల్లోనూ భరోసా నింపింది. ఇన్నాళ్లూ నిరాశలో ఉన్న చిన్న పార్టీలు సైతం బీజేపీ విజయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగేందుకు అడుగులు వేస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తమకు కూడా కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు విపక్ష నేతలు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అందుకు తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో వరదలు, ప్రజల ఇబ్బందులను ఎజెండాగా మలుచుకోవాలని టీడీపీ, టీజేఎస్‌ భావిస్తున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. 

Tags:    

Similar News