యాదాద్రి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ..

లాక్ డౌన్ కారణంగా మూతపడిన దేవాలయాలన్నీ సడలింపుల్లో భాగంగా తెరచుకున్న విషయం తెలిసిందే.

Update: 2020-06-15 05:24 GMT

లాక్ డౌన్ కారణంగా మూతపడిన దేవాలయాలన్నీ సడలింపుల్లో భాగంగా తెరచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొత్తగా అన్ని హంగులతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ఆరు వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామి వారిని దర్శించు కోవటానికి హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర నెలల తరువాత యాదాద్రి కొండపై భక్తుల సందడి నెలకొంది. కాగా స్వామి వారి దర్శనానికి వచ్చిన చాలామంది భక్తులు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహించడంతో పాటు భౌతిక దూరం సైతం పాటించలేదు. ప్రసాదాల కొనుగోలు వద్ద, ఆలయ పరిసరాల్లో భక్తులు గుంపులు గుంపులుగా కనిపించారు. అంతే కాకుండా ఇంకా ఇతర దేవాలయాల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగిపోతున్నారు. 


Tags:    

Similar News