Medaram: మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం..
Medaram: ప్రత్యేక బస్సుల్లోనూ కొనసాగుతున్న మహాలక్ష్మీ పథకం
Medaram: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు వస్తున్నారని, జాతర ప్రారంభం నాటికి వారి సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.
దాదాపు 4వేల,800 సీసీ కెమెరాలను పెట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6 వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామని, మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేశామని, ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులను నడుపుతామని, ఇందుకు 9 వేల మంది సిబ్బందిని నియమించామని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు 4వేల మంది కార్మికులను నియమించామని సీఎస్ చెప్పారు.
మేడారం జాతరకు భక్తజనం పోటెత్తుతోంది. ఈనెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర జరగనుండగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంది.