Liquor Policy Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

Update: 2024-05-27 10:15 GMT

Liquor Policy Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. కవిత తరపున ఆమె న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని వాదించారు. మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సీఆర్‌పీసీలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని, దానిపై విచారణ జరుగుతుండగానే ఈడీ, సీబీఐ సమన్లు ఇచ్చాయని కోర్టుకు వివరించారు.

ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించగా.. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వబోమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ప్రకటన చేశారని అన్నారు. అంతలోనే ఒక రోజు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి, అదే రోజు సాయంత్రానికి అరెస్టు చేశారని చెప్పారు. అయితే, దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ తరఫు న్యాయవాది గడువు కోరారు. రేపు మధ్యాహ్నం తాము ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామని ఈడీ, సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. దాంతో రేపు తీర్పు రిజర్వ్ చేస్తామంటూ వాయిదా వేసింది హైకోర్టు. 

Tags:    

Similar News