Telangana: రైతుల పంట రుణమాఫీ మార్గదర్శకాలివే...
Telangana: రైతుల పంట రుణమాఫీ మార్గదర్శకాలివే...
పంట రుణమాఫీకి మార్గదర్శకాలు
1. తెలంగాణలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
2. రుణమాఫీ పథకం 2018 డిసెంబర్ 12న, ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యూవల్ అయిన పంట రుణాను మాఫీ చేస్తారు. అలాగే, 09-12-2023 నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
3. తెలంగాణ రైతులు 2023 డిసెంబర్ 9 నాటికి బకాబయి పడిన అసలు, వడ్డీ మొత్తం మాఫీ చేస్తారు.
4. రైతు కుటుంబాన్ని రేషన్ కార్డు ఆధారంగానే గుర్తిస్తారు.
5. రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న కుటుంబాల వారు, రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని ముందుగా బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాతే రుణ మాఫీ కింద రూ. 2 లక్షలను రైతు ఖాతాకు జమ చేస్తారు.
6. ప్రతి రైతు కుటుంబానికి 09-12-2023 నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో అంటే తక్కువ మొత్త నుంచి మొదలు పెట్టి 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తారు.
7. రూ. 2లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న కుటుంబంలో తొలుత మహిళల పేరున ఉన్న రుణాన్ని మాఫీ చేస్తారు. ఆ తర్వాత పురుషుల పేరున ఉన్న రుణాన్ని మాఫీ చేస్తారు.
8. రీ షెడ్యూల్ చేసిన రుణాలకు రుణమాఫీ వర్తించదు.
9. కంపెనీలు, వ్యాపార సంస్థలకు రుణమాఫీ వర్తించదు. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది.
10. రుణమాఫీ పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తెలిసినా, అక్రమంగా పంట రుణాన్ని పొందినట్లు తేలిన పక్షంలో, అలాంటి వారు రుణమాఫీ కింద పొందిన మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి.