Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు!

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-01 16:00 GMT
Representational Image

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 10I8 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 17,357 కి చేరింది. ఇందులో ప్రస్తుతం 9,008 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 8,082 మంది కోలుకున్నారు. ఇక ఈరోజు కరోనా నుంచి 788 డిచ్ఛార్జ్ కాగా ఏడుగురు మృతి చెందారు.

ఈరోజు నమోదైన 1018 కేసులో ఒక జిహెచ్ఎంసి పరిధిలోనే 881 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి లో 33 ,మేడ్చల్ 36, సంగారెడ్డి, కరీంనగర్ లలో రెండేసి కేసులు, మహబూబ్ నగర్ లో 10, గద్వాల 1 ,సూర్యాపేట 2, ఖమ్మం 7, కామారెడ్డి 2, నల్గొండ 4, సిద్దిపేట 3, ములుగు 2, వరంగల్ రూరల్, మంచిర్యాల్ 9 జగిత్యాల4, నిజామాబాద్ 3, ఆసిఫాబాద్, మెదక్ ,ఆదిలాబాద్, యాదాద్రి లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 267 మరణాలు చోటుచేసుకున్నాయి..

ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.. 

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,653 కేసులు నమోదు కాగా, 507 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 5,85,493 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,20,114 ఉండగా, 3,47,979 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,400 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,17,931 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 88,26,585 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. 


Tags:    

Similar News